Sathupalli: ఈనెల 16న సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చల్లగుళ్ల ప్రమాణ స్వీకారం

Sathupalli: సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్‌గా చల్లగుళ్ల నరసింహారావు ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 16న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి ముఖ్య అతిథులుగా నిర్వహణ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 12 Nov 2026 7:59 PM IST
Sathupalli
X

Sathupalli: ఈనెల 16న సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చల్లగుళ్ల ప్రమాణ స్వీకారం

సత్తుపల్లి: సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన చల్లగుళ్ళ నరసింహారావు పదవి ప్రమాణ స్వీకారం ఈనెల 16వ తేదీన అనగా సోమవారం సాయంత్రం సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జరగనున్నది.

దీనితోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 16వ తేదీ అనగా సోమవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.

ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ గారు మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారితో పాటు రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. 16వ తేదీ మూడు గంటల కు స్థానిక సాయి బాలాజీ ఫంక్షన్ హాలు నుండి మోటర్ సైకిల్ ర్యాలీగా బయలు దేరనున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI