Kothagudem: సింగభూపాలెంలో మద్యపాన నిషేధానికి చొరవ.. సర్పంచ్ కు అభినందనలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెంలో మద్యపాన నిషేధానికి చొరవ తీసుకున్న సర్పంచ్ కిన్నెర వెంకన్నపై గ్రామ ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
Kothagudem: సింగభూపాలెంలో మద్యపాన నిషేధానికి చొరవ.. సర్పంచ్ కు అభినందనలు!
Kothagudem: మద్యపాన నిషేధం అంటే కేవలం మద్యాన్ని అరికట్టడం మాత్రమే కాదని, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపడంతో పాటు మహిళలకు ప్రశాంతమైన జీవనాన్ని, పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించడమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సుజాతనగర్ మండలం, సింగభూపాలెం గ్రామంలో మద్యపాన నిషేధం దిశగా చొరవ తీసుకొని, గ్రామ ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్న గ్రామ సర్పంచ్ కిన్నెర వెంకన్నపై గ్రామ ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో ఏర్పడుతున్న ఆర్థిక, సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
మంచి నాయకత్వం అంటే కేవలం పదవిలో కొనసాగడం కాదని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమేనని పేర్కొంటున్నారు. గ్రామ అభివృద్ధితో పాటు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మద్యపాన నిషేధానికి ముందడుగు వేయడం అభినందనీయమని గ్రామస్తులు కొనియాడుతున్నారు.
ఈ నిర్ణయం గ్రామంలో సామాజిక మార్పునకు నాంది పలకాలని, మహిళలు, యువత, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో మద్యపాన రహిత గ్రామంగా సింగభూపాలెం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.




