Sarapaka: సారపాక గ్రామ సమస్యలపై పంచాయతీ ఈవోకి బీఆర్ఎస్ వినతిపత్రం!
Sarapaka: సారపాకలో వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ఈవో రవికుమార్కు బీఆర్ఎస్ సారపాక టౌన్ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చారు.
Sarapaka: సారపాక గ్రామ సమస్యలపై పంచాయతీ ఈవోకి బీఆర్ఎస్ వినతిపత్రం!
సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా వినతి పత్రం సారపాక ఈవో గుగులోతు రవికుమార్ కు ఇచ్చారు.
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలము. మా గ్రామంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న వివిధ స్థానిక సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తూ, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, తాగునీటి సరఫరాలో ఉన్న ఇబ్బందులు తొలగించాలి.
మురుగు కాలువల శుభ్రత పూర్తిగా లోపించింది, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. చెత్త తొలగింపులో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. అంతర్గత రహదారుల మరమ్మతులు తదితర సమస్యలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం సంబంధిత అధికారుల బాధ్యత. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించడం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత.
ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారం కానప్పుడు వాటిని అధికారుల దృష్టికి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు.
ఈ నేపథ్యంలో, గ్రామంలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించి, సంబంధిత శాఖల ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. కేవలం హామీలకే పరిమితం కాకుండా, ప్రజలకు క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడినది కాదు.
అది ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యం, ప్రభుత్వ బాధ్యత. ప్రజల ఇబ్బందులను నిర్లక్ష్యం చేయకుండా, ఈ వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపి, గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాము.
అదేవిధంగా, ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని బతుకమ్మ గద్దెల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, తగిన వీధి దీపాలు, విద్యుత్ లైటింగ్, చెత్త తొలగింపు వంటి ఏర్పాట్లు చేపట్టాలి. మహిళలు, యువతులు, గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా అవసరమైన,సౌకర్యాలు కల్పించాలి.
పండుగ సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కావున, మా గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలతో పాటు బతుకమ్మ పండుగకు అవసరమైన ఏర్పాట్లను కూడా ప్రాధాన్యతతో పరిగణనలోకి తీసుకొని, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టవలసిందిగా ప్రజల పక్షాన కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, కనకా చారి, భూక్య శ్రీను, దారం కృష్ణారెడ్డి, ఆంజనేయులు, కర్రీ నాగేశ్వరరావు, పంగి సురేష్, మోహన్, గుల్ మహమ్మద్, బి ఆర్ ఎస్ మహిళ నాయకులు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.




