Pinapaka: భట్టుపల్లి మినీ స్టేడియం పనులకు రూ.3.5 కోట్లు ఇవ్వాలని పాయం విజ్ఞప్తి!

Pinapaka: భట్టుపల్లి మినీ స్టేడియం పనులకు అదనంగా రూ.3.5 కోట్లు మంజూరు చేయాలని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 24 Nov 2026 7:00 PM IST
Pinapaka
X

Pinapaka: భట్టుపల్లి మినీ స్టేడియం పనులకు రూ.3.5 కోట్లు ఇవ్వాలని పాయం విజ్ఞప్తి!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారిని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు నేడు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గంలో క్రీడా మైదానాల అభివృద్ధి, యువ క్రీడాకారుల ప్రోత్సాహం, క్రీడాకారుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా కరకగూడెం మండలం భట్టుపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం మిగిలిపోయిన బ్యాలెన్సింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనంగా రూ.3.5 కోట్లు మంజూరు చేయాలని మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు.

అదేవిధంగా పినపాక నియోజకవర్గంలోని క్రీడల పట్ల ఆసక్తి కలిగిన యువతను, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు తదితర అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి, క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు.

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేసిన విజ్ఞప్తులపై మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నియోజకవర్గ యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA