Bhadrachalam: భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రంలో ఘనంగా శబరి స్మృతి యాత్ర!

Bhadrachalam: భద్రాచలం శ్రీరామ ఆలయంలో శబరి స్మృతి యాత్ర ఘనంగా జరిగింది. గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో నగర సంకీర్తన నిర్వహించి స్వామివారికి అడవి ఫలాలను సమర్పించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 26 Oct 2026 10:57 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రంలో ఘనంగా శబరి స్మృతి యాత్ర!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సీతారామ లక్ష్మణులు వనవాసం చేసే సమయంలో వారికోసం ఎదురుచూసి ఎంగిలి పండ్లను తినిపించిన శబరి నీ స్మరిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు అధికారులు.

తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచి గిరిజనులను, కొండరెడ్లను ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి ఆలయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గిరిజనుల సాంప్రదాయ కొమ్ము నృత్యాలు, రేలా నృత్యాలు, నాయకపోడుల వేషధారణ, కొండరెడ్ల నృత్యాలతో ఆలయ ప్రదక్షణ గిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన నిర్వహించారు.

అనంతరం ఆలయం వద్ద గల శబరి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి గిరిజనులు తీసుకువచ్చిన అడవి ఫల పండ్లను పూలను స్వామి వారికి సమర్పించారు. భారీగా కదిలి వచ్చిన గిరిజనులతో ఆలయ ప్రాంతం మొత్తం సందడిగా మారింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచి పూనం కృష్ణ, ఆలయ ఈవో దామోదర్ రావు గిరిజన సంఘాల నాయకులు ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem