Julurupad: తుఫాను బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి!
Julurupad: జూలూరుపాడు మండలంలో తుఫానుకు దెబ్బతిన్న పంటలను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ పరిశీలించి, నష్టపరిహారం కోరారు.
Julurupad: తుఫాను బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి!
Julurupad: మురుసు తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, ఇతర సాగు పంటలు తీవ్రంగా నష్టం జరిగిందని గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ చేతికొచ్చిన పంటలు వర్షాల కారణంగా నీటమునిగి, నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టాన్ని అంచనా వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు దెబ్బతిన్న ప్రతి రైతును గుర్తించి, నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే పెట్టుబడుల భారం, సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రకృతి వైపరీత్యం మరింత నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టి, వారికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
పత్తి పంటకు నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 30 వేలు మొక్కజొన్న మిర్చి వరి పంటలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల నష్ట పరిహారం చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, పోనే కంటి వెంకటేశ్వర్లు వలమల్ల సామేలు తూము కోటయ్య, దుద్దుకూరు శ్రీను చీమకుర్తి సంతోష్ మదే బోయిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.




