Kothagudem: బీఆర్ఎస్ దీక్షా దివస్ సభలో రసాభాస.. మైనారిటీల ఆగ్రహం!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ దీక్షా దివస్ సభలో మైనారిటీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆందోళన జరిగింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Nov 2026 2:05 PM IST
Kothagudem
X

Kothagudem: బీఆర్ఎస్ దీక్షా దివస్ సభలో రసాభాస.. మైనారిటీల ఆగ్రహం!

Kothagudem: కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది.

కొత్తగూడెం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభా వేదిక పైకి పలువురు నాయకులను ఆహ్వానించినప్పటికీ, మైనారిటీ నాయకులను ఆహ్వానించకపోవడంపై వివాదం చెలరేగింది. దీంతో మైనారిటీ నాయకులు సభా వేదిక ముందు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము కూడా ఉద్యమంలో భాగస్వాములమయ్యామని, అయినప్పటికీ పార్టీ నాయకత్వం తమను విస్మరిస్తోందని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌లో మైనారిటీ నాయకులకు తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో సభా ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మైనారిటీ నాయకులకు పార్టీ కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM