Yellandu: ఇల్లందులో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ!
Yellandu: మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతికి నివాళులు అర్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.
Yellandu: ఇల్లందులో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ!
Yellandu: మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఇల్లందు ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఘటనకు కారకురాలైన నిందితురాలని కఠినంగా శిక్షించాలని ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం ఇల్లందు పట్టణం కొత్తబస్టాండ్ నుండి జగదాంబ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.
ప్రయాణికుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల పై దాడులను అరికట్టాలని రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం లో ఆర్ ర్టీసీ యూనియన్ నాయకులు ఇమ్మడి వెంకటేశ్వర్లు, దనసరి అంజయ్య, కలిల్, పచ్చిపాల కృష్ణ, ఏలేశ్వర్ రావు తదితరులు ఉన్నారు.




