Bijapur: బీజాపూర్ మావోయిస్టు డంప్‌లో రూ.39.77 లక్షల నగదు స్వాధీనం!

Bijapur: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా పెద్దేపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన డంప్‌ నుంచి రూ.39.77 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 25 Nov 2026 9:41 PM IST
Bijapur
X

Bijapur: బీజాపూర్ మావోయిస్టు డంప్‌లో రూ.39.77 లక్షల నగదు స్వాధీనం!

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా భైరంగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దేపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. అందులో దాచిన రూ.39.77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 24న పెద్దేపల్లి అడవుల్లో అనుమానాస్పద వస్తువులు భూమిలో దాచినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బీజాపూర్‌ ఎస్పీ ఉమేశ్‌ ప్రసాద్‌ గుప్తా ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవీంద్ర కుమార్‌ మీనా పర్యవేక్షణలో, భైరంగఢ్‌ ఎస్‌డీఓపీ నవీన్‌ కుమార్‌ ఏక్కా నేతృత్వంలో డీఆర్‌జీ, భైరంగఢ్‌ పోలీసులు, బాంబు నిర్వీర్య బృందం సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో బీడీఎస్‌ బృందం డీమైన్‌ింగ్‌, తనిఖీలు నిర్వహించగా భూమిలో బస్తాలో ఉంచి పాతిపెట్టిన స్టీల్‌ డబ్బా లభించింది. దానిని తెరిచి చూడగా టేపులతో చుట్టిన ప్యాకెట్లలో రూ.500 నోట్ల రూపంలో మొత్తం రూ.39,77,000 నగదు బయటపడింది. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి భైరంగఢ్‌ పోలీస్‌స్టేషన్‌లో చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.