Bhadrachalam: భద్రాద్రి రామయ్య అన్నదానానికి రూ.1.16 లక్షల విరాళం అందజేసిన దంపతులు

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య అన్నదానానికి పట్టణానికి చెందిన కొత్త రామకృష్ణ, వనజ దంపతులు రూ.1,16,000 విరాళం అందజేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 9 Nov 2026 3:49 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాద్రి రామయ్య అన్నదానానికి రూ.1.16 లక్షల విరాళం అందజేసిన దంపతులు

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటున్నారు.

భద్రాద్రి ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్న ప్రసాదం అందే విధంగా రామాలయం అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు 1500 నుంచి 2000 మందికి అన్నప్రసాద్ అని అందిస్తున్నారు. శని ఆదివారాల్లో 2000 నుంచి 3000 వరకు అన్న ప్రసాదం సిద్ధంగా ఉంటుందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు.

రామాలయం అన్నదానానికి లక్ష 16 వేల విరాళం.. కొత్త రామకృష్ణ, వనజగారు

భద్రాచలం పట్టణం అశోక నగర్ కాలనీకి చెందిన కొత్త రామకృష్ణ వనజ దంపతులు వారి కుమారుడు నివాస్, కుమార్తె భవ్య శ్రీ..కుటుంబ సమేతంగా రామాలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి నిత్య అన్నదానానికి ఒక లక్ష 16 వేల రూపాయల చెక్కును రామాలయం అధికారులకు అందజేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem