Julurpadu: కాకర్లలో కోరమండల్ సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు
Julurpadu: జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ సహకారంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.
Julurpadu: కాకర్లలో కోరమండల్ సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు
జూలూరుపాడు: జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ వారి సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దాతలు, కోరమండల్ కంపెనీ వారి సహకారంతో ఈ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టగా, అతి త్వరలో ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామంలోని సాయి మహాలక్ష్మి ట్రేడర్స్ ప్రొప్రైటర్ కళ్యాణపు ప్రసాద్ చేసిన విజ్ఞప్తి మేరకు కోరమండల్ ఫెర్టిలైజర్ కంపెనీ వారు కాకర్ల గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి ఉపయోగకరమైన సేవా కార్యక్రమానికి కృషి చేసిన కళ్యాణపు ప్రసాద్‌తో పాటు సహకారం అందించిన కోరమండల్ ఫెర్టిలైజర్ కంపెనీ యాజమాన్యానికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభించనుంది.




