Bhadrachalam: జీరం ఘాట్ నిందితుల ఉరిశిక్షను రద్దు చేసి విడుదల చేయాలి: తిరుపతయ్య!
Bhadrachalam: భద్రాచలంలో ఆదివారం జరిగిన మానవ హక్కుల వేదిక 9వ జిల్లా మహాసభలో జీరం ఘాట్ నిందితుల ఉరిశిక్షను రద్దు చేసి విడుదల చేయాలని డా. ఎస్. తిరుపతయ్య డిమాండ్ చేశారు.
Bhadrachalam: జీరం ఘాట్ నిందితుల ఉరిశిక్షను రద్దు చేసి విడుదల చేయాలి: తిరుపతయ్య!
భద్రాచలం: భద్రాచలం పట్టణం కేంద్రంలో మానవ హక్కుల వేదిక 09 వ జిల్లా మహాసభలు నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్ .తిరుపతయ్య , మరియు వక్తగా హాజరైన రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోట దేవదానం గారు మాట్లాడుతూ... నాగరిక సమాజంలో శిక్షల పేర మనుషుల ప్రాణాలను తీసే హక్కు న్యాయస్థానాలకు కూడా లేదని అన్నారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా . ఎస్ . తిరుపతయ్య గారు మాట్లాడుతూ... 2013 లో జీరం ఘాట్ సంఘటనలో నిందితులుగా 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన పది మందికి ఇటీవల ఎన్ ఐ ఏ కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని తప్పుపట్టారు. జీరం ఘాటి దాడి అనంతరం దాడి చేసిన మావోయిస్టులు అక్కడ నుండి భద్రంగా తప్పించుకోగా పరిసర గ్రామాల్లోని కేవలం సానుభూతి పరులను పదకొండు మందిని అరెస్ట్ చేసి 13సంవత్సరాలుగా బెయిలు, పెరోల్ లేకుండా అన్యాయంగా జైలులో ఉంచారన్నారు.
జైలు నిర్బంధంలోనే ఒక వ్యక్తి మరణించగా మిగిలిన పది మందికి NIA కోర్టు ఒక్కొక్కరి నేరాలు సాక్షాలు ఆధారంగా కాకుండా , ఎటువంటి సాక్ష్యాలు లేకున్నా ఈ పది మందే హత్యలు చేసినట్టుగా ఊహించుకుని గంపగుత్తగా అందరికి ఉరిశిక్ష వేయడం చట్ట విరుద్ధం అన్నారు. సామాజికంగా అత్యంత బలహీన వర్గానికి చెందిన నిరుపేద ఆదివాసీలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం , రాష్ట్ర పోలీసులు మరియు NIA ఏకపక్షంగా కేసు నడిపి అమాయకులకు శిక్షలు వేయడం అన్యాయం అన్నారు.
లొంగిపోయిన మావోయిస్ట్ నాయకులకు వారు చేసిన నేరాలపై విచారణలు , శిక్షలకు మినహాయింపులు ఇచ్చినప్పుడు కేవలం సానుభూతి పరులైనందుకు వీరికి ఉరిశిక్షలు వేయడం సరైంది కాదన్నారు. అలాగే ఈ పది మంది మావోయిస్టులకు సహాయపడినందుకు చట్ట పరిధిలోకి వచ్చే నేరాలకు శిక్షలు వేయధకుచుకున్న అంతకుమించిన జైలు శిక్షను ఇప్పటికే వారు అనుభవించినందున ఇకపై వారిని ఏ విచారణ లేకుండానే వెంటనే విడుదల చేయాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకుని ఈ పది మంది ఆదివాసి యువతీ యువకులకు వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి సభాద్యక్షత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాదర్ బాబా వహించగా ,కార్యక్రమంలో డా , భానుప్రసాద్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ ఆదినారాయణ , సొంధి వీరయ్య , ముద్ద వీరభద్రం , అలవాల రాజా , పరికిడి శ్రీనివాస్ , రంగారావు, మునిగేల శివకుమార్, సున్నం రమేష్ , మాల మహానాడు అధ్యక్షుడు పౌలు రాజు , నల్లమోతు సురేష్ , కొండల్ రావు , ఊకె ముక్తేశ్వర్ రావు , మేకల లత , వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ వివిధ ఆదివాసి , దళిత బహుజన ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.




