Sathupalli: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సత్తుపల్లిలో సమీక్ష!
Sathupalli: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సత్తుపల్లిలో ప్రత్యేక అధికారి చందన్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందనుండగా, నవంబర్ 19 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Sathupalli: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సత్తుపల్లిలో సమీక్ష!
సత్తుపల్లి: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా సత్తుపల్లి మండల ప్రత్యేక అధికారి శ్రీ చందన్ గారి అధ్యక్షతన గ్రామ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ కార్యాలయం సత్తుపల్లి నందు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి చందన్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
పథకానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు:
1. కుటుంబ యజమాని వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించబడుతుంది.
3. బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
4. ఈ నెల 19వ తేదీ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయాలు మరియు సంబంధిత హ్యాబిటేషన్లలో దరఖాస్తులు స్వీకరించబడతాయి.
5. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
6. గ్రామ పంచాయతీలలో కౌంటర్ల వారీగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేయబడతాయి.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకునేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వరరావు, మండల పంచాయతీ అధికారి (MPO) జోష్న, గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




