Kothagudem: జపాన్ పర్యటన ముగించిన కలెక్టర్ అంకిత్‌కు రెవెన్యూ అభినందన

Kothagudem: జపాన్ పర్యటన ముగించి భద్రాద్రి జిల్లాకు వచ్చిన కలెక్టర్ అంకిత్‌కు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అభినందన; అభివృద్ధి మోడల్ అమలుపై ఆకాంక్ష.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 25 Nov 2026 7:09 PM IST
Kothagudem
X

Kothagudem: జపాన్ పర్యటన ముగించిన కలెక్టర్ అంకిత్‌కు రెవెన్యూ అభినందన

కొత్తగూడెం: జపాన్ దేశ అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించుకొని జిల్లాకు తిరిగి వచ్చిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ , ఐఏఎస్ గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ భాద్యులు కలసి అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం నుంచి పర్యటనకు ఎంపిక అయి అక్కడి విద్య, అభివృద్ధి మోడల్ ను విజయవంతంగా అధ్యయనం చేసి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు.

రాష్ట్రం నుంచి ఒకే ఒక సివిల్ సర్వీసెస్ అధికారిగా ఎంపిక అయినందుకు తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఇటువంటి అవకాశాలు భవిష్యత్ లో మరెన్నో రావాలని అభిలషించారు.

ఈ కార్యక్రమంలో TRESA రాష్ట్ర సెక్రటరీ శ్రీ కృష్ణ ప్రసాద్ , జిల్లా ప్రధాన కార్యదర్శి డి. పుల్లయ్య , కలెక్టరేట్ పాలనాధికారి రామ కృష్ణ, జిల్లా అసోషియేట్ అధ్యక్షులు దారా ప్రసాద్ , శంకర్ , కోశాధికారి రంగా ప్రసాద్ , కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు అంజాద్ పాషా , కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ప్రభాకర్ , ఇతర సంఘ భాద్యులు , రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM