Khammam: దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ దివాకర టిఎస్
Khammam: ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ దివాకర టిఎస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Khammam: దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం, నవంబర్- 02: ప్రజా వినతుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.
ఖమ్మం అర్భన్ మండలం కైకొండాయిగూడెం గ్రామానికి చెందిన కే.రవీంద్ర బాబు సర్వే నెంబర్ 230 లో ఉన్న భూమి సర్వే చేసి రికార్డు మార్పు చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఏదులాపురం పట్టణానికి చెందిన పలువురు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని వీటిని సవరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ కు రాస్తూ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు
కూసుమంచి మండలం తురకగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ బుర్ర కృష్ణ తమ గ్రామంలో కొమ్ము ఇందిరమ్మకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించడం జరిగిందని దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులందరూ మరణించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ ఇంటికి చట్టబద్ధమైన హక్కు దారులు ఎవరైనా ఉన్నారు విషయాన్ని పరిశీలించాలని, చట్టపరమైన హక్కు దారులు ఎవరూ లేకపోతే మరో లబ్ధిదారుల్ని ఎంపిక చేసే పంపిణీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
చింతకాని మండలం వందనం గ్రామం చెందిన ప్రజలు మత్స్య శాఖ సభ్యులు వందనం గ్రామ చెరువుకు సాగర్ ఎడమ కాలు ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించి చెరువులు నింపాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎస్ఈ ఇరిగేషన్ కు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, డిఆర్ఓ సీహెచ్. రామ్మూర్తి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-------------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.




