Sathupalli: సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలి: జాజిరి డిమాండ్!
Sathupalli: సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి ఆర్వో ప్లాంట్ల రిపేర్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి డిమాండ్.
Sathupalli: సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలి: జాజిరి డిమాండ్!
సత్తుపల్లి: సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
శనివారం వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి మండల కమిటీ సమావేశం పిల్లి నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ప్రజల కోసం ఏర్పాటు చేసి ఆర్వో వాటర్ ప్లాంట్ లు అనేక చోట్ల పని చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పనిచేయని ఆర్వో ప్లాంట్లను వెంటనే మరమ్మతులు చేయించి, నిరంతరం శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను ప్రజల అవసరాలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని కోరారు.
పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయి నిర్మానుషంగా మారాయి అన్నారు. వాటికి నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలను గుర్తించి ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని కోరారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొలికి పోగు సర్వేశ్వరరావు, అయినంపూడి సనంద రావు, బండి వేలాద్రి,తడికమళ్ళ రామకృష్ణ , బెజవాడ లక్ష్మీనారాయణ, మల్లాది వెంకట్, ఎలగం రాములు, సప్పిడి భాస్కర్, పరమేష్, సరోజినీ తదితరులు పాల్గొన్నారు.




