Bhadrachalam: ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించండి: సబ్ కలెక్టర్
Bhadrachalam: భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు.
Bhadrachalam: ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించండి: సబ్ కలెక్టర్
భద్రాచలం: డివిజన్ ప్రజలు వివిధ సమస్యల గురించి ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్న అందరికీ సంబంధిత అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు వారికి సంబంధించిన వివిధ సమస్యల గురించి నేరుగా ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకుంటే సమస్యలు పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అవకాశం ఉంటుందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.
ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ప్రజావాణిలో సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి వివిధ అధికారుల సమక్షంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ దరఖాస్తుదారులు కోరిన విధంగా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలతో పాటు రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు నిరుద్యోగులకు సంబంధించిన వినతి పత్రాలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఇందులో ముఖ్యంగా రెవిన్యూ సమస్యలు, పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలతో నిరుద్యోగులు వారికి సంబంధించిన సమస్యల గురించి పరిష్కరించాలని అలాగే పలు రకాల సమస్యలపై ప్రజలు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేసి సంబంధిత డివిజన్ అధికారులకు పంపుతూ, ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాకాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని, పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు.




