Kothagudem: భద్రాచలం రోడ్ స్టేషన్ పేరు మార్చాలి..కేంద్ర మంత్రికి కూనంనేని లేఖ!

Kothagudem: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును కొత్తగూడెం రైల్వే స్టేషన్‌గా మార్చాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 12 Oct 2026 12:36 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాచలం రోడ్ స్టేషన్ పేరు మార్చాలి..కేంద్ర మంత్రికి కూనంనేని లేఖ!

Kothagudem: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును కొత్తగూడెం రైల్వే స్టేషన్ గా మార్చాలి - కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాసిన కూనంనేని.

భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును తక్షణమే "కొత్తగూడెం రైల్వే స్టేషన్" గా మార్చాలని కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు ఆయన లేఖలు రాశారు.

భద్రాచలం రోడ్ పేరు మార్చాలి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ గా నామకరణం చేయాలి. ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ పేరు ఉండాలని లేఖలో పేర్కొన్నారు. స్టేషన్ ఉన్నది కొత్తగూడెంలోనే అయినందున ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పేరు మార్చడం న్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM