Kothagudem: 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై ప్రశ్నలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర అభివృద్ధి వేదిక నిలదీత. డ్రాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్.
Kothagudem: 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై ప్రశ్నలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత కొత్తగూడెం 2BHK ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర అభివృద్ధి వేదిక పలు ప్రశ్నలు లేవనెత్తింది. మొత్తం 828 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హౌసింగ్ శాఖ రికార్డుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినవి, కేటాయించినవి, తాళాలు అప్పగించినవి, లబ్ధిదారులు నివసిస్తున్న ఇళ్లు శూన్యంగా ఉన్నాయని వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితం 614 మంది కోసం డ్రా నిర్వహించగా, తాజాగా మరో 214 మంది కోసం డ్రా నిర్వహించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. నిర్మాణాలు పూర్తికాకముందే వరుసగా డ్రాలు నిర్వహించడానికి ప్రాతిపదిక ఏమిటో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మొత్తం 828 ఇళ్ల నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టం చేయాలని కోరారు. అలాగే డ్రాల ప్రాతిపదిక, లబ్ధిదారుల జాబితాలను బహిర్గతం చేయాలని, విడుదలైనట్లు పేర్కొంటున్న రూ.17 కోట్ల నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.




