Sathupally: సత్తుపల్లిలో పి.వై.ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశం!

Sathupally: సత్తుపల్లిలో పి.వై.ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశం. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కులను కాలరాస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ఎన్.వి. రాకేష్ డిమాండ్.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 14 Oct 2026 6:54 PM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లిలో పి.వై.ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశం!

Sathupally: సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్‌ లో ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ పాల్గొని మాట్లాడుతూ, భారతదేశంలో ప్రజాపోరాటాల ద్వారా సాధించుకున్న ఓటు హక్కును సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాలరాస్తున్నారని, ఆయనను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్.ఎస్.ఎస్, బిజెపి ఒత్తిళ్లకు లొంగి రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కులను తొలగించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని విమర్శించారు. దేశంలో సుమారు 13 కోట్ల మంది అర్హులైన యువత ఓట్లను తొలగిస్తూ, బీజేపీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిలిపివేసి, తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని కోరారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై తీవ్రమైన నిర్బంధకాండను ప్రయోగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, యువజన వ్యతిరేక విధానాలపై యువతను చైతన్యపరిచి, పి.వై.ఎల్ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్, సహాయ కార్యదర్శులు బి.ఎస్. కృష్ణ, కొర్సం రామకృష్ణ, కమిటీ సభ్యులు భీమేష్, సిద్దు, ప్రేమ్ సింగ్, మంగయ్య, కరుణాకర్ మరియు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి సంగం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నార.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI