Khammam: ఖమ్మంలో దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి.. పువ్వాడ పిలుపు!
Khammam: శ్రీకాంతాచారి బలిదానానికి కాంగ్రెస్ కారణమని పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. నవంబర్ 29న ఖమ్మంలో దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Khammam: ఖమ్మంలో దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి.. పువ్వాడ పిలుపు!
Khammam: తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి బలిదానం చేసుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ:మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
చంపినోడే సంతాపం తెలిపినట్లు రేవంత్ రెడ్డి శంకరమ్మ మీద ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు..
ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని రైపిల్ రెడ్డి కేసిఆర్ తెచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు.
ఆనాడు ఉద్యమంలో 1400 మంది చనిపోతే ఎప్పుడైనా సంతాపం తెలపని రేవంత్ రెడ్డి. నవంబర్ 29 ‘దీక్షా దివస్’ను ఖమ్మంలో అత్యంత ఘనంగా నిర్వహించాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు.
‘’కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో‘’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అంకురార్పణ జరిగిన ఖమ్మం గడ్డపై, నవంబర్ 29న నిర్వహించే ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన, నాటి ఉద్యమ ఘట్టాలను, చారిత్రక నేపథ్యాన్ని, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ వరంగల్లో దీక్ష చేపడితే ఉత్తర తెలంగాణ మొత్తానికి కేంద్రంగా ఉండి పెద్ద ఎత్తున సమస్య అవుతుందనే ఉద్దేశంతో, నాటి సమైక్య ప్రభుత్వం కేసీఆర్ గారిని బలవంతంగా ఖమ్మంకు తరలించింది.ఖమ్మంలో ఉద్యమ ఉధృతి తక్కువగా ఉందనే కుట్రపూరిత ఆలోచనతో నాటి ప్రభుత్వం ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ, ఖమ్మం ప్రజలు తెలంగాణ కోసం అండగా నిలిచారు. నాడు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు లెఫ్ట్ పార్టీలు, సీపీఐ ఎంఎల్ వంటి శక్తులు కూడా కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలిచాయి.
నిరాహార దీక్ష కొనసాగుతున్న వేళ బలవంతంగా సెలైన్ ఎక్కించే ప్రయత్నాలను కేసీఆర్ గారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ దీక్ష తెలంగాణ సాధనకు తొలిమెట్టుగా నిలిచింది. కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసేలా చేసింది.ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అనేక బలిదానాలు చోటుచేసుకున్నాయి.
రాబోయే తరాలకు తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులపై రైఫిల్స్ ఎక్కుపెట్టిన చరిత్ర ఉన్నవారు, నేడు ఉద్యమ త్యాగాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. శ్రీకాంతాచారి గారి త్యాగాన్ని, శంకరమ్మ గారి పోరాటాన్ని గుర్తుచేసుకున్న ఆయన, గతంలో హుజూర్నగర్ ఉపఎన్నికలో ఆమెపై పోటీ చేసి ఓడించిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ అభివృద్ధి ప్రపంచానికి తెలిశాయి. 371(D) ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా లోకల్ కోటాలో మన పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాయి.
కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారు కృషి చేశారు. సీతారామ ప్రాజెక్టు మేమే కట్టినట్లుగా నీళ్లు నెత్తిన చల్లుకున్న మంత్రి మూడేళ్లు అయినా పూర్తి చేయలేదు గత మూడేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం, పనులను ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల ఖమ్మం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
ఖమ్మం నియోజకవర్గానికి దీక్షా దివస్ నిర్వహణలో రెట్టింపు బాధ్యత ఉందని, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
కార్యక్రమంలో నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ,పగడాల నాగరాజు,కర్నాటి కృష్ణ,బచ్చు విజయ్ కుమార్,ఖమర్, వీరు నాయక్,గుత్తా రవి, మెంతుల శ్రీశైలం,పొన్నం వెంకటేశ్వర్లు,బత్తుల మురళి,పిన్ని కోటేశ్వరరావు, ఎండి పాషా,షకీనా,ఊర్మిళ, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




