Khammam: ఖమ్మం నగరంలో మందుబాబుల హల్‌చల్.. బాల రక్షణ భవన్ వెనుక బహిరంగ మద్యం!
Khammam: ఖమ్మం నగరంలోని పాత డీఆర్డీఏ కార్యాలయం, బాల రక్షణ భవన్ వెనుక మందుబాబులు బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు.
Khammam: ఖమ్మం నగరంలో మందుబాబుల హల్‌చల్.. బాల రక్షణ భవన్ వెనుక బహిరంగ మద్యం!
Khammam: ఖమ్మం నగరంలోని పాత డిఆర్ డీ ఏ కార్యాలయంలో బాల రక్షణ భవన్ వెనుక పలువురు మందుబాబులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఘటన వెలుగులో కి వచ్చింది.
ఆర్ అండ్ బి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఆఫీస్ వెనక భాగంలో అసాంఘిక కార్యకలాపాలకు నిత్యం జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాత డి ఆర్ డి ఓ కార్యాలయం ప్రాంతములో ఆర్ అండ్ బి శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీరింగ్ శాఖ మరియు బాల రక్షా భవన్ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. దాంతో పాటు ఎస్ బి ఐ బ్యాంకు కూడా ఉంది. నిత్యం ప్రజలు వివిధ పనుల కోసం ప్రజలు వస్తూ పోతూ ఉండే ప్రాంతంలో మందుబాబులు పెద్ద ఎత్తున చేరుకుని పట్టపగలే మందుతాగుతూ అరుస్తూ స్థానిక ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నారనిఆరోపణలు వినిపిస్తున్నాయి.
సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో బాలరక్షణ భవన్ పరిసరాల్లో భద్రతపై ప్రశ్నలు వ్యక్తం అక్కుతున్నాయి.
ప్రభుత్వ ఆఫీస్ లకు వచ్చే ప్రజలకు ఇబ్బంది గా మారిన వైనంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ వ్యక్తం అవుతోంది.




