Chinthakani: దివంగత జర్నలిస్ట్ సత్యానందం కుటుంబానికి ప్రెస్ క్లబ్ చేయూత!
Chinthakani: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బోనకల్ రిపోర్టర్ మందా సత్యానందం కుటుంబాన్ని చింతకాని మండల ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
Chinthakani: దివంగత జర్నలిస్ట్ సత్యానందం కుటుంబానికి ప్రెస్ క్లబ్ చేయూత!
చింతకాని: బోనకల్ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన రిపోర్టర్ మందా సత్యానందం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జర్నలిస్టుగా సమాజానికి విశేష సేవలందిస్తూ, ప్రజా సమస్యలు, అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించిన సత్యానందం మృతి పట్ల చింతకాని మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సత్యానందం కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చింతకాని మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు జొన్నలగడ్డ మల్లీశ్వరి, సెక్రటరీ వెన్న బోయిన సురేందర్, అంబటి శాంతయ్య,గుడిద పిచ్చయ్య, సురేష్ శెట్టి, గడ్డం విజయ్, గండారపు రామారావు, వేర్పుల కోటేశ్వరరావు, గంటల తిరుపతాచారి చాపలమడుగు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బోనకల్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తేనె వెంకటేశ్వర్లు, షేక్ బడే సాహెబ్, డేగల యాలాద్రి గ్రామ సర్పంచ్ మంద కరుణ, ఏసుపోగు బాబు, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య గ్రామ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.




