Khammam: ఖమ్మం పోలీస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు!
Khammam: ఖమ్మంలోని శ్రీ కృష్ణప్రసాద్ మెమోరియల్ పోలీస్ సంక్షేమ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను చిన్నారులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు.
Khammam: ఖమ్మం పోలీస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు!
Khammam: శ్రీ కృష్ణప్రసాద్ మోమోరియల్ పోలీస్ సంక్షేమ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
స్కూల్ చైర్ పర్సన్ నిష్టాశర్మ ఆధ్వర్యంలో చిన్నారులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని పాఠశాలలో ఉపాధ్యాయులు బతుకమ్మ ఉత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థుల ఆట,పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాజు, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.




