Khammam: ప్రజావాణికి కరువైన ప్రజల స్పందన.. వచ్చినది ఒక్కటే దరఖాస్తు!

Khammam: ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. కేవలం ఒకే ఒక్క దరఖాస్తు రావడం, పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

G Ravi, Bhadradri
Published on: 3 Nov 2026 10:54 AM IST
Khammam
X

Khammam: ప్రజావాణికి కరువైన ప్రజల స్పందన.. వచ్చినది ఒక్కటే దరఖాస్తు!

Khammam: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికిbతీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం అతి తక్కువ మంది హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

కార్యక్రమంలో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే అందగా, అది ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సమర్పించినట్లు తెలిసింది.

ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు సరైన సమాచారం అందడం లేదా? లేక ప్రజలకు సమస్యలు లేవా? అరే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు వివిధ సమస్యలతో తిరుగుతున్నప్పటికీ, ప్రజావాణి కార్యక్ర మానికి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం గమనార్హం. మరోవైపు, ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని ముఖ్యమైన శాఖలకు చెందిన అధికారులు గైరాజరు కావడం కూడా చర్చకు దారితీసింది.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri