Bhadradri: మధ్యవర్తులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కై నకిలీ రైతులను చేర్చారని ఆరోపణ!

Bhadradri: సింగరేణి మణుగూరు ఓసీ భూసేకరణలో నకిలీ సాగుదారులను చేర్చి కోట్లు వసూలు చేసిన వారిపై విజిలెన్స్ విచారణ జరిపి కఠిన చర్యలు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 25 Nov 2026 11:51 AM IST
Bhadradri
X

Bhadradri: మధ్యవర్తులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కై నకిలీ రైతులను చేర్చారని ఆరోపణ!

మణుగూరు: సింగరేణి మనుగూరు ఓసి భూ విస్తరణకు ప్రస్తుతం భూమిని సేకరిస్తున్న తరుణంలో సంబంధం లేని కొత్త వ్యక్తులు సాగు దారులం అంటూ కొందరు మధ్యవర్తులు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది సహకారంతో జాబితాలో చేరారు. ఇలా చేయడం వల్ల అసలు రైతులకు అందవలసిన పరిహారం తగ్గడంతో పాటు భారమై సింగరేణి ఈ ప్రాజెక్టును వద్దు అనుకుంటే మణుగూరు భవిష్యత్తు కి ఆటంకంగా మారే పరిస్థితి ఉంది. కావున ఈ అక్రమాలు వెలికి తీసేందుకు రాష్ట్ర అధికారులు దృష్టి సారించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని రేణుక అక్షర మహిళా మండలి తరపన డిమాండ్ చేస్తున్నాము.ప్రభుత్వ భూములు మాయమైనాయి.

సింగరేణి దాదాపు 800 ఎకరాలకు పైగా భూమి సేకరిస్తుండగా, అందులో అటవీ భూమి, రెవిన్యూ భూమి, పట్టాభూమి ఉన్నాయి.m. అటవీ భూమికి అటవీ అధికారులు ఉండగా పట్టా భూమికి రైతులు హక్కు దారులుగా ఉన్నారు. మరి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన రెవిన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు. కుంట, అరగుంట, కనీసం ట్రాక్టరు తిరగని ప్రదేశంలో పక్క జిల్లాల నుండి వచ్చిన వ్యక్తులు వ్యవసాయం చేస్తుంటే బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు. అసలు రైతులకు ఎంజాయ్మెంట్ సర్వే జరిగే సమయంలో కనీసం నోటీసు సైతం ఇవ్వకుండా సాగులో లేరంటూ రకరకాల సాకులు చెప్పి కొత్త వ్యక్తులను తెచ్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు అసలు వ్యవసాయం అంటే తెలియని వారి పేర్లు కూడా చేర్చారు. ఇప్పుడు అసలు రైతులు కోర్టులకు వెళ్లడంతో నకిలీ రైతులను తొలగించాలని ఆదేశాలు వస్తున్నాయి. మరి ఆ నకిలీ రైతులపై అక్రమంగా చొరబడ్డారంటూ రెవిన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసే ధైర్యం ఉందా.

రెవిన్యూ అధికారులు వారి వద్ద నుండి ఎటువంటి డబ్బులు తీసుకోకపోతే నకిలీ అని గౌరవ కోర్టు తేలుస్తున్న వారి పైన క్రిమినల్ కేసుల నమోదు చేసి భూ పరిరక్షణకు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏజెన్సీ ఏరియాలో అన్నదమ్ముల్లాగా ఉన్న ప్రజలకు భరోసా కల్పించాలి. అసైన్మెంట్ భూములను కూడా విక్రయాలు జరిగాయంటూ ఐదు ఐదుగుంటలు, 10 గుంటలు నమోదు చేశారు. చట్టం ప్రకారం అసైన్మెంట్ భూములు విక్రయించొచ్చా విక్రయించకూడదా అనే విషయాలు రెవెన్యూ అధికారులే చెప్పాలి. మణుగూరులో ఇటీవల ప్రభుత్వ భూములు అని బోర్డులు పెట్టినవి కూడా తొలగించి డబ్బులు ఇచ్చిన వారికి కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సింగరేణి భూసేకరనలో ఓ కీలక అధికారి కొంతమంది పేర్లు చేర్చి ప్రతిఫలంగా నమ్మకం లేక వారి నుండి బినామీ వ్యక్తుల పేరు మీద చెక్కులు మీద తీసుకున్నారనీ తెలుస్తోంది.

మణుగూరు ఓసి పై సింగరేణి నిర్ణయం మార్చుకున్నా, అసలైన రైతులకు న్యాయం జరగకపోయినా, అక్రమంగా జాబితాలో ప్యాకేజీల కోసం చేర్చుకున్న వారి పేర్లు తొలగించకపోయినా రేణుక అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో మణుగూరు అభివృద్ధిని ఆకాంక్షించే సంఘాలను ఐక్యం చేసి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడతాము. ఈ అంశాన్ని ఎంపీ బలరాం నాయక్ గారి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు ఎండి షబానా, కోరి శ్యామల ,కన్నాపురం వసంత తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA