Palair: ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ఏటా ఆర్థిక సాయం చేస్తానని మంత్రి అభయం!
Palair: కోరట్లగూడెం వైద్య విద్యార్థిని రిషితకు మంత్రి పొంగులేటి రూ.50 వేలు అందించి, ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ఏటా ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Palair: ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ఏటా ఆర్థిక సాయం చేస్తానని మంత్రి అభయం!
Palair: పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థినికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఏటా ఆర్థిక సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు.నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం గ్రామానికి చెందిన బచ్చలకూరి రామారావు కుమార్తె రిషిత సంగారెడ్డిలోని రాజరాజేశ్వరి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఫీజుల చెల్లింపునకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో బుధవారం మంత్రి పొంగులేటిని కలిసి తన పరిస్థితిని వివరించి సాయం కోరింది.
విద్యార్థిని అభ్యర్థనపై మంత్రి వెంటనే స్పందించి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా వైద్య విద్య పూర్తయ్యే వరకు ప్రతి ఏటా అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థినికి సూచించారు. మంత్రి చూపిన చొరవకు రిషిత కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, సర్పంచ్ కొత్తపల్లి త్రివేణి వెంకటేశ్వర్లు, నాయకులు కొత్తపల్లి సుబ్బారావు, సత్యాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




