Khammam: పోలేపల్లిలో రూ. 4.65 కోట్లతో బీటీ రోడ్లకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన!
Khammam: ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామంలో రూ. 4.65 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
Khammam: పోలేపల్లిలో రూ. 4.65 కోట్లతో బీటీ రోడ్లకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన!
Khammam: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రూ. 4.65 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రెండు నూతన బిటి రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఇందులో రూ. 2.42 కోట్ల అంచనా వ్యయంతో పోలేపల్లి నుండి దానవాయిగూడెం (వయా మున్నేరు) వరకు, రూ. 2.20 కోట్ల అంచనా వ్యయంతో పోలేపల్లి నుండి రామునిపేట వరకు బీటీ రోడ్ల నిర్మాణాలు వున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ (200 యూనిట్లు), ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా అందిస్తున్నామన్నారు. పోలేపల్లి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే నూతన రేషన్ డీలర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు.
అర్హులైన ప్రతి పేదవానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ స్కూల్ లో స్థల సమస్య ఉన్నందున, సమీపంలో అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నూతన స్కూల్ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలకు కట్టుబడి ఉన్నామని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, హౌసింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, పిఆర్ ఈఈ మహేష్ బాబు, స్థానిక సర్పంచ్ బత్తిని మహేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.




