Sathupalli: సేవారత్న పురస్కారానికి ఎంపికైన సత్తుపల్లికి చెందిన శివకుమార్!
Sathupalli: గత 18 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్తుపల్లికి చెందిన పోలిశెట్టి శివకుమార్ 'సేవారత్న' పురస్కారానికి ఎంపికయ్యారు.
Sathupalli: సేవారత్న పురస్కారానికి ఎంపికైన సత్తుపల్లికి చెందిన శివకుమార్!
Sathupalli: సామాజిక సేవా రంగంలో విశేష సేవలందిస్తున్న సత్తుపల్లి పట్టణానికి చెందిన పోలిశెట్టి శివకుమార్ 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన సేవారత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందిస్తున్న వారికి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.
సత్తుపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత 18 సంవత్సరాలుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఆర్యవైశ్య సంఘం ద్వారా శివకుమార్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదలకు అండగా నిలవడం, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, అంత్యక్రియల నిర్వహణలో అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించడం వంటి సేవల ద్వారా ఆయన గుర్తింపు పొందారు. ఈ సేవలను గుర్తించిన విశ్వజనని ఫౌండేషన్ ఆయనను సేవారత్న పురస్కారానికి ఎంపిక చేసింది.
డిసెంబరు 20వ తేదీన నరసరావుపేటలో నిర్వహించనున్న విశ్వజనని ఫౌండేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో శివకుమార్‌కు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం, చింతలపూడి భాజపా అధ్యక్షుడు, ఫౌండేషన్ సభ్యుడు మాడా ఉమామహేశ్వరరావు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ సేవారత్న పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన సేవా ప్రయాణంలో సహకరించిన మిత్రులకు, సత్తుపల్లి పట్టణ ఆర్యవైశ్య పెద్దలకు, పట్టణ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శివకుమార్‌కు సేవారత్న పురస్కారం దక్కడం పట్ల సత్తుపట్టణంలో హర్షం వ్యక్తమవుతోంది.




