Kothagudem: పూజారి కాంకేర్ అడవుల్లో 280 BGL షెల్స్ మావోయిస్టు డంప్ స్వాధీనం!

Kothagudem: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు పూజారి కాంకేర్ అడవుల్లో 16.11.2026న లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు 280 BGL షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Nov 2026 6:03 PM IST
Kothagudem
X

Kothagudem: పూజారి కాంకేర్ అడవుల్లో 280 BGL షెల్స్ మావోయిస్టు డంప్ స్వాధీనం!

Kothagudem: తేదీ: 16.11.2026 న లొంగిపోయిన మావోయిస్టులు అందించిన విశ్వసనీయ సమాచారంపై చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు BD టీం సహాయంతో తెలంగాణ-ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దులోని పూజారి కాంకేర్ గ్రామానికి సమీప అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినారు. గాలింపు చర్యలలో సిపిఐ మావోయిస్టు పార్టీ PLGA బెటాలియన్ కి చెందిన మూడు డంపులను గుర్తించడం జరిగింది. ఒక్కోడంపులో ఒక్క సింథటిక్ వాటర్ ట్యాంక్ డ్రమ్ అమర్చి దానిలో ఉంచిన BGL షెల్స్ ని గాలింపు బృందాలు గుర్తించినాయి. అట్టి BGL షెల్ప్ ను డంపుల నుండి బయటకు తీసిలెక్కించగా అవి మొత్తం 280 BGL షెల్స్ ఉన్నవి.

2025 సంవత్సరం ప్రారంభంలో సిపిఐ మావోయిస్టు PLGA బెటాలియన్ వికేంద్రీకరణ జరిగిన సమయంలో PLGA బెటాలియన్ యొక్క ఒకటవ కంపెనీకి చెందిన ఈ BGL షెల్స్ ను డంపులలో దాచిపెట్టినట్టు పోలీసులు గుర్తించినారు. ఈ దట్టమైన అటవీ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా భావించిన మావోయిస్టులు ఈ డంపులను భవిష్యత్తు అవసరాలకోసం దాచిపెట్టినారు. మావోయిస్టు కదలికలు మళ్లీ పుంజుకున్న సమయంలో ఈ BGL షెల్స్ ను ఉపయోగించుకునే ఆలోచనతో ఈ డంపులను పెట్టినారు.

2025 సంవత్సరం చివరి భాగంలో మరియు 2026 సంవత్సరం ప్రారంభంలో అనేకమంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగినది. తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ప్రకారం తెలంగాణ పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులకు కావలసిన సదుపాయాలు కల్పిస్తూ మానవత దృక్పథంతో వారి యోగక్షేమాలు చూసుకుంటున్నారు. తెలంగాణ పోలీసుల సహాయ సహకారాలకు ఆకర్షితులైన మావోయిస్టులు, మావోయిస్టు పార్టీ రహస్యంగా దాచిపెట్టిన డంపుల సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు తెలియపరుస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇవ్వాల్సిన నగదు రివార్డును లొంగిపోయిన వెంటనే చెల్లిస్తున్నారు మరియు ఇంటి స్థలాన్ని కూడా ఇస్తున్నారు. వ్యవసాయ భూమి మరియు స్వయం ఉపాధి కొరకు బ్యాంకుల నుండి రుణం మొదలగు సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్య రక్షణ పథకం కింద లొంగిపోయిన మావోయిస్టులకు హెల్త్ కార్డ్స్ ను కూడా అందజేస్తున్నారు. స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆసక్తి గలవారికి వారు ఎన్నుకున్న రంగాలలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నారు.

ముప్పాల లక్ష్మణరావు @ గణపతి తో పాటు ఒకరిద్దరూ మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారిని జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా కోరుతున్నది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆహ్వానిస్తుంది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM