Manuguru: కమలాపురంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్!

Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. సరైన పత్రాలు లేని 63 వాహనాలు, 7 బెల్ట్ షాపుల సీజ్.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 7 Nov 2026 1:02 PM IST
Manuguru
X

Manuguru: కమలాపురంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్!

Manuguru: ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మణుగూరు మండలం కమలాపురం గ్రామంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేస్తున్నామని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా పట్టణాలు, బస్తీల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్రామాల్లోకి అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించినట్లు వివరించారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అలాగే 7 బెల్ట్ షాపులపై దాడులు చేసి రూ.18,300 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA