Aswaraopeta: మున్సిపాలిటీ ఆఫీస్ నిర్మాణం అడ్డుకున్న వారిపై కేసు నమోదు!

Aswaraopeta: అశ్వరావుపేటలో కొత్త మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణ పనులను అడ్డుకున్న వారిపై మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 18 Nov 2026 10:05 AM IST
Aswaraopeta
X

Aswaraopeta: మున్సిపాలిటీ ఆఫీస్ నిర్మాణం అడ్డుకున్న వారిపై కేసు నమోదు!

Aswaraopeta: అశ్వరావుపేట రింగ్ రోడ్డు సెంటర్లోని కొత్త మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన పాత MPDO ఆఫీస్ స్థలములో మున్సిపాలిటీ సిబ్బంది JCBతో పాత బిల్డింగ్ లను పడగొట్టి పనులు ప్రారంబిస్తుండగా పేరాయిగూడెం గ్రామానికి చెందిన నార్లపాటి నాగపద్మ, భర్త పేరయ్య, నార్లపాటి శ్రీనివాసరావు, తండ్రి: పేరయ్య, నార్లపాటి మల్లికా, భర్త శ్రీనివాసరావు,

నార్లపాటి రాజ శేఖర్, తండ్రి రాములు అనువారు మున్సిపాలిటీ సిబ్బందిని అడ్డగించి అట్టి స్థలం మాది కొత్త మున్సిపాలిటీ కార్యాలయ పనులు ప్రారంభించుటకు వీలులేదని సిబ్బందిని బెదిరించగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ ముసికి వెంకటరమణ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వగా B.సాయి కిషోర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA