Palwancha: పాల్వంచ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల చేతిలో 100 కిలోల కనుజు మృతి!
Palwancha: పాల్వంచ మండలం మందరికలపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో సుమారు 100 కిలోల కనుజును వేటగాళ్లు హతమార్చడంతో అటవీ అధికారులు కేసు నమోదు చేశారు.
Palwancha: పాల్వంచ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల చేతిలో 100 కిలోల కనుజు మృతి!
పాల్వంచ: అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాల్వంచ మండలం మందరికలపాడు సమీపంలోని వన్యప్రాణి అటవీ ప్రాంతంలో సుమారు 100 కిలోల బరువున్న కనుజును వేటగాళ్లు హతమార్చిన ఘటన కలకలం రేపింది.
సుమారు రెండు గంటల పాటు వేట కొనసాగినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నట్లు తెలుస్తుండగా, వారంతా మందరికలపాడు గ్రామానికి చెందినవారేనని సమాచారం. వీరిలో ఒకరు మైనర్ ఉన్నట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న యానాంబైల్ రేంజ్ అధికారి కవిత మాధురి అటవీ సిబ్బందిని అప్రమత్తం చేసి చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. వేటకు పాల్పడిన వారిని గుర్తించి తదుపరి చర్యలు చేపట్టేందుకు అటవీశాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.




