Chintur: చింతూరులో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!

Chintur: అల్లూరి జిల్లా చింతూరులో మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ నేతలు, యువత ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేసి ర్యాలీ నిర్వహించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 18 Sept 2026 8:12 AM IST
Chintur
X

Chintur: చింతూరులో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!

Chintur: చింతూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను యువత ఎంతో ఘనంగా నిర్వహించారు.బిజెపి నేత నామాల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలవడం జరిగిందని అన్నారు. నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని యువత చాటుకున్నారు. బాణాసంచా పేల్చి హోరెత్తించారు.

చింతూరు ప్రధాన సెంటర్లో ర్యాలీ చేపట్టి నరేంద్ర మోడీ నినాదాలతో మార్మోగించారు.ఈ కార్యక్రమంలో కాశి, తమ్మినేని రామారావు,బేడే సతీష్,మల్లెపూడి సతీష్, మల్లెల ప్రదీప్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR