Pinapaka: ఘనంగా 70వ మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల ప్రారంభం

Pinapaka: పినపాక మండలంలో ఘనంగా ప్రారంభమైన 70వ పాఠశాలల క్రీడా పోటీలు. హాజరైన MPDO సంకీర్త్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 16 Sept 2026 7:39 PM IST
Pinapaka
X

Pinapaka: ఘనంగా 70వ మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల ప్రారంభం

పినపాక: పినపాక మండల విద్యాశాఖ అధికారి శ్రీ కొమరం నాగయ్య గారి ఆధ్వర్యంలో, ZPHS జానంపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి K. విజయలక్ష్మి మేడం గారి అధ్యక్షతన 70వ పినపాక మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక MPDO శ్రీ సంకీర్త్ గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు జట్టుస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జానంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి పూనెం ఉమామహేశ్వరి గారు, పినపాక మండల అధ్యక్షులు శ్రీ పేరం వెంకటేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ దాట్ల రాజేష్ గారు పంచాయతీ సెక్రటరీ శ్రీ రహీమ్ గారు, గ్రామ పెద్దలు- ముళ్లపూడి ప్రకాశం గారు, గ్రామ పెద్దలు, జానంపేట యూత్,ZPHS పినపాక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ D రామిరెడ్డి గారు, ZPHS దుగినేపల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీ రాంగోపాల్ గారు, క్రీడా ప్రాంగణ ఆర్గనైజర్ సెక్రెటరీ G రాములమ్మ గారు, B వీరన్న, D వరలక్ష్మి గారు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు K ఆదినారాయణ గారు, E బాలరాజు గారు, ZPHS జానంపేట పాఠశాల సిబ్బంది,పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు (PET's & PD's), CRP's - D ముకేష్, K సాంబశివరావు, మండల పరిధిలోని AGHS, KGBV, ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.

మండల పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, క్రీడా సిబ్బంది మరియు విద్యార్థి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను ఉత్సాహభరితంగా ప్రారంభించారు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యం. వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తి, పరస్పర గౌరవం మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని చాటుతున్నారు.

ఈ మండల స్థాయి పోటీల ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA