Kothagudem: కొత్తగూడెంలో 'నక్సల్ ముక్త్ భారత్'పై వార్తాలాప్ వర్క్‌షాప్!
Kothagudem: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (PIB) ఆధ్వర్యంలో నవంబర్ 13న కొత్తగూడెంలో వార్తాలాప్ వర్క్‌షాప్. నక్సల్ ముక్త్ భారత్, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన.
Kothagudem: కొత్తగూడెంలో 'నక్సల్ ముక్త్ భారత్'పై వార్తాలాప్ వర్క్‌షాప్!
Kothagudem: నక్సల్ ముక్త్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో వార్తాలాప్ మీడియా వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
నవంబర్ 13న ఉదయం 10 గంటలకు హేమచంద్రాపురంలోని కొత్తగూడెం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గల మీడియా బ్రీఫింగ్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రధానాంశాలు:
నక్సల్ ముక్త్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ కార్యాచరణపై ప్రత్యేక చర్చ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై మీడియాకు అవగాహన. నక్సలిజం నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షాత్మక చర్చ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ చర్యలపై వివరణ. మీడియా ప్రతినిధులకు సంబంధిత అంశాలపై నేరుగా ప్రశ్నలు అడిగి తెలుసుకునే అవకాశం.
ఈ వర్క్‌షాప్‌లో ఎస్పీ ఇంటెలిజెన్స్ CH. సింధూ శర్మ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ముఖ్య వక్తలుగా పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. నక్సలిజం నిర్మూలన దిశగా ప్రభుత్వ లక్ష్యాలు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న చర్యలు, జిల్లాలో నెలకొన్న పరిస్థితులను మీడియా ప్రతినిధులకు వివరించనున్నారు.
ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కోరింది.




