Sathupalli: అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో ఫోటో ఎగ్జిబిషన్!
Sathupalli: హైదరాబాద్‌లో అక్టోబర్ 2 నుంచి 4 వరకు నిర్వహించనున్న ఫోటో ఎగ్జిబిషన్ ప్రచార పోస్టర్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆవిష్కరించారు.
Sathupalli: అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో ఫోటో ఎగ్జిబిషన్!
సత్తుపల్లి: హైదరాబాద్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఫోటో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం సత్తుపల్లిలో ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి కనకారావు, మండల ప్రెసిడెంట్, సోనీ స్టూడియో అధినేత పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్ ఫోటో టెక్ అధినేత అభిమన్యు రెడ్డి, కెనాన్ కెమెరా మెంటర్ భూపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫోటోగ్రాఫర్లు అందిపుచ్చుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో జరగనున్న ఎగ్జిబిషన్లో నూతన కెమెరాలతో పాటు కెమెరాలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే సుమారు 100 కంపెనీలు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఫోటోగ్రాఫర్లు ఎగ్జిబిషన్‌ను సందర్శించి ఆధునిక కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుని తమ వృత్తిలో మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్యే రాగమయి సూచించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ సుమాంజలి రాము, మండల సెక్రెటరీ రాంబాబు, కోశాధికారి మూర్తి, ఫోటోగ్రఫీ సభ్యులు గాంధీ, అన్వర్ పాషా, బాబీ, పరిమి వెంకటేశ్వరరావు, హరీష్, కోటేశ్వరరావు, కల్కి వెంకటేశ్వరరావు, మురళి, నరేష్, నవీన్, సుబ్బారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.




