Palvancha: పెద్దమ్మగుడి షాపుల వేలంలో కాసుల పంట.. రూ.2.11 లక్షల అదనపు ఆదాయం!

Palvancha: పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో నిర్వహించిన షాపుల వేలంలో గతేడాదితో పోలిస్తే రూ.2,11,200 అదనపు ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 3 Nov 2026 10:43 AM IST
Palvancha
X

Palvancha: పెద్దమ్మగుడి షాపుల వేలంలో కాసుల పంట.. రూ.2.11 లక్షల అదనపు ఆదాయం!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం గ్రామ శివారులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో సోమవారం నిర్వహించిన సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలంలో దేవస్థానానికి అదనపు ఆదాయం సమకూరింది. నాలుగు షాపుల వేలంలో గత ఏడాదితో పోలిస్తే రూ.2,11,200 అదనంగా వచ్చినట్లు దేవస్థానం ఈవో ఏ.విజయ్ కుమార్ తెలిపారు.

దేవాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ అధికారి కె.ఆనంద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. దేవస్థానానికి చెందిన రెండు ఏసీ ఫంక్షన్ హాళ్లు, కొత్త షాపింగ్ కాంప్లెక్స్‌లోని 1, 2, 3, 5, 6, 7, 8, 10, 12 నంబర్ల షాపులు, పాత కాంప్లెక్స్‌లోని పూలు, పూలదండలు, ఫొటోలు, ప్రసాదాల విక్రయ షాపులకు మూడేళ్ల లీజు కాలానికి వేలం నిర్వహించారు.

ఈ వేలంలో నాలుగు షాపులకు భారీగా పోటీ నెలకొంది. షాపు నంబర్ 5ను జగన్నాధపురానికి చెందిన పి.వీరభద్రం రూ.1,44,000కు దక్కించుకున్నారు. గత ఏడాది ఈ షాపు లీజు రూ.98,400గా ఉండగా, ఈసారి రూ.45,600 పెరిగింది. షాపు నంబర్ 6ను నిహార్, భవాని రూ.1,32,000కు దక్కించుకోగా, గత ఏడాదితో పోలిస్తే రూ.45,600 అదనంగా వచ్చింది.

అదేవిధంగా షాపు నంబర్ 7ను బి.నాగలక్ష్మి రూ.1,69,200కు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.1,03,200గా ఉన్న లీజు మొత్తం ఈసారి రూ.66,000 పెరిగింది. షాపు నంబర్ 8ను బి.శైలజ రూ.3,72,000కు దక్కించుకోగా, గత ఏడాది రూ.3,18,000తో పోలిస్తే రూ.54,000 అదనంగా లభించింది.

ఈ నాలుగు షాపుల ద్వారా మాత్రమే గత ఏడాదితో పోలిస్తే దేవస్థానానికి మొత్తం రూ.2,11,200 అదనపు ఆదాయం సమకూరింది. అయితే మిగిలిన షాపులు, ఫంక్షన్ హాళ్ల వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటి వేలం ప్రక్రియను వాయిదా వేసినట్లు ఈవో వెల్లడించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN