Pinapaka: ఉప్పాకలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
Pinapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Pinapaka: ఉప్పాకలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
Pinapaka: పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన గృహాల్లో లబ్ధిదారులు పటేల్ రాజేశ్వరి, రామ టెంకి లక్ష్మి, గంజి సరిత గార్ల గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు ఎంతో భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హ్యాండ్బోర్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంలో ఈ హ్యాండ్బోర్ ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, MRO, హౌసింగ్ ఏఈ, సంబంధిత అధికారులు, మండల అధ్యక్షులు పేరం వెంకటేశ్వర్లు, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ తొలేం కళ్యాణి, డైరెక్టర్ లు, ఆత్మా కమిటీ సభ్యులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




