Bhadrachalam: భద్రాచలంలో వృద్ధులు, దివ్యాంగులకు బియ్యం పంపిణీ

Bhadrachalam: భద్రాచలం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిహాల్ పుట్టినరోజు సందర్భంగా పరివర్తన యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు బియ్యం పంపిణీ చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 21 Sept 2026 6:24 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో వృద్ధులు, దివ్యాంగులకు బియ్యం పంపిణీ

భద్రాచలం: స్థానిక భద్రాచలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి, గిరిజన సహాయ చేతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొమ్మ గిరి యశోద నిహాల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు, దివ్యాంగులకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి అధ్యక్షులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానవతావాది,రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి, డాక్టర్ భాను ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.... పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి, గిరిజన సహాయ చేతులు సంక్షేమ సంఘం ఈ రెండు సంస్థలు సమాజంలో ఆదరణ లేక, ప్రభుత్వం నుండి సక్రమంగా అందాల్సిన పెన్షన్ అందక, తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా ఉంటూ, ప్రమాదాల గురైన వారికి, రక్తహీనతతో బాధపడుతున్న వారికి, గర్భిణీలకు,రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారికి అండగా ఉంటూ రక్త దానం చేస్తు మానవ సేవ చేస్తున్న పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి, గిరిజన సహాయ చేతుల సంక్షేమ సంఘం సభ్యులను ఆదర్శంగా తీసుకొని సేవ గునం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మరిన్ని సామాజిక సేవలు చేయాలని అన్నారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి అధ్యక్షులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు కుమారుడు కొమ్మ గిరి యశోద నిహాల్ తండ్రి బాటలో చిన్న వయసునుండే నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, సామాజిక ఉద్యమకారులు అలవాల రాజా పెరియార్,మహాజన మహిళా మండలి రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల లత, గిరిజన సహాయ చేతులు సంక్షేమ సంఘం అధ్యక్షులు కుంజ అర్జున్, సభ్యులు మర్మం చిట్టిబాబు, ఇర్ప నాగరాజు, పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి సభ్యులు ఆళ్ల సత్యనారాయణ, బర్ల జాన్ కుమార్, గాడిది కృష్ణ, రాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem