Palwancha: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహనకు కరపత్రాల పంపిణీ!
Palwancha: పాల్వంచ మండలం సూరారంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం సర్పంచ్ సోడే మహేశ్వరి ప్రవీణ్ కరపత్రాలు పంపిణీ చేశారు.
Palwancha: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహనకు కరపత్రాల పంపిణీ!
పాల్వంచ: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు సూరారం గ్రామపంచాయతీలో శుక్రవారం కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోడే మహేశ్వరి ప్రవీణ్ పాల్గొని ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సర్పంచ్ గ్రామ ప్రజలకు సూచించారు.




