Palwancha: పాల్వంచ శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Palwancha: పాల్వంచ ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, విద్యార్థులకు ఆటల పోటీలు పెట్టి బహుమతులు అందించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 14 Nov 2026 6:43 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచ శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

పాల్వంచ: పాల్వంచ పట్టణ పరిధిలోని ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాణి మిర్యాల గారు మాట్లాడుతూ.. పిల్లలందరికీ ముందుగా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్యం భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన వరమని, అభం, శుభం తెలియని ఆ పసిమనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు చిన్నారులు అని కొనియాడారు.

​మనదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పండిಟ್ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు.

నెహ్రూకు పిల్లలతో ఉన్న బాందవ్యాన్ని తెలుపుతూ, మనదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి దేశానికి ఎక్కువకాలం ప్రధానిగా సేవలు అందించారని పేర్కొన్నారు. నెహ్రూగారికి పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ అని చెబుతూ ఆయన సేవలను కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జోన్ ఏ.జి.ఎం శ్రీ వీరన్న గారు మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనలో చీకటిలో పడ్డ దేశాన్ని తనదైన దక్షతతో ముందు చూపుతో పురోగతి దిశగా నడిపించారని, సమాజంలో మంచి చెడులను ఎలా గ్రహించాలి తదితర అంశాలను వివరించి నెహ్రూ గారి సేవలను కొనియాడారు. విద్యార్థిని, విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

​అనంతరం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. చిన్నారులు రకరకాల వేషధారణలో వచ్చి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రైమరీ ఇన్చార్జ్ మహమ్మద్ సిరాజ్ బేగం మరియు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN