Palwancha: తొగూడెంలో జల సంరక్షణ 30 ఇంకుడు గుంతలకు స్థలాల గుర్తింపు
Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగూడెంలో 30 ఇంకుడు గుంతలు, సామూహిక కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేసిన అధికారులు.
Palwancha: తొగూడెంలో జల సంరక్షణ 30 ఇంకుడు గుంతలకు స్థలాల గుర్తింపు
పాల్వంచ: ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో భూగర్భ జలమట్టాన్ని పెంచడం, వర్షపు నీటిని సంరక్షించడం లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక జల సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మార్గదర్శకాల మేరకు పాల్వంచ మండలం తొగూడెం గ్రామపంచాయతీలో శనివారం 30 వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి స్థలాలను గుర్తించారు. అలాగే రెండు సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు కూడా స్థలాలను ఎంపిక చేశారు.
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో సంతృప్త స్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలవనరులను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జల సంరక్షణతో పాటు గ్రామీణ పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బొప్పన అనూష, సీఈఓ బి. నాగలక్ష్మి, ఎంపీఓ షేక్ షబ్నా, పంచాయతీ కార్యదర్శి రమేష్, సర్పంచ్ శుభ, ఉపసర్పంచ్ రాంబాబు, వీబీజీ రాంజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




