Palwancha: నవభారత్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా 47వ వార్షిక క్రీడా దినోత్సవం

Palwancha: పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్‌లో 47వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐఎఫ్ఎస్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 14 Nov 2026 6:48 PM IST
Palwancha
X

Palwancha: నవభారత్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా 47వ వార్షిక క్రీడా దినోత్సవం

పాల్వంచ: పట్టణంలోని నవభారత్ పబ్లిక్ స్కూల్ లో 47వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎఫ్ఎస్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఎంఈఓ శ్రీరామ్ మూర్తి హాజరయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్, హెచ్ ఎం జ్యోతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

తొలుత గణపతి గీతంతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ సీసీ విద్యార్థులతో పాటు ట్రైల్ బ్లేజర్స్, క్రూసేడర్స్, వాయేజర్స్, పయనీర్స్ అనే నాలుగు హౌస్ ల విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా జెండాను ఆవిష్కరించారు. రంగురంగుల బెలూన్లను గాలిలోకి వదులుతూ 47వ వార్షిక క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో కీలకమని, క్రీడలు క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, పట్టుదలను పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులను ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN