Kothagudem: జాతీయ స్థాయిలో అటవీ అమరవీరుడు బానోత్ నవీన్‌కు అరుదైన గుర్తింపు

Kothagudem: పాల్వంచ అటవీ రేంజ్‌లో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు బానోత్ నవీన్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి గుర్తింపునిచ్చింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Updated on: 24 Oct 2026 7:29 PM IST
Kothagudem
X

Kothagudem: జాతీయ స్థాయిలో అటవీ అమరవీరుడు బానోత్ నవీన్‌కు అరుదైన గుర్తింపు

Kothagudem: అటవీ రక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుడు స్వర్గీయ బానోత్ నవీన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ఫ్రంట్‌లైన్ స్టాఫ్‌ – ప్రొటెక్షన్ అండ్ యాంటీ పోచింగ్ విభాగంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది.

బానోత్ నవీన్ పాల్వంచ అటవీ రేంజ్ పరిధిలోని ముసలిమడుగు సెక్షన్‌, చెరువుసింగారం వెస్ట్ బీట్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు.

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని వన్యప్రాణి విభాగం చేపట్టిన గుర్తింపు కార్యక్రమంలో భాగంగా, అక్టోబర్ 7న నిర్వహించిన సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించారు. మూడు విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది లేదా బృందాలు, సంస్థలను ఎంపిక చేసి అక్టోబర్ 16న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

అటవీ రక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, ధైర్యసాహసాలు, త్యాగాలకు ఈ జాతీయ గుర్తింపు నిదర్శనమని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఐఎఫ్‌ఎస్‌ తెలిపారు. బానోత్ నవీన్ సేవలు, త్యాగం జిల్లా అటవీ శాఖ సిబ్బందికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ గుర్తింపు గౌరవప్రదమని పేర్కొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM