Palwancha: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చరిత్రాత్మకం: కొత్వాల శ్రీనివాసరావు!
Palwancha: పాల్వంచ 36వ డివిజన్‌లో నిర్వహించిన 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకల్లో కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం చరిత్రాత్మకమని కొనియాడారు.
Palwancha: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చరిత్రాత్మకం: కొత్వాల శ్రీనివాసరావు!
పాల్వంచ: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చరిత్రాత్మకమైనదని పాల్వంచ సొసైటీ చైర్మన్, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో భాగంగా ఆదివారం పాల్వంచ పట్టణ పరిధి 36వ డివిజన్ గట్టాయిగూడెంలో కార్పొరేటర్ పెడిపల్లి జయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి కొత్వాల పాల్గొన్నారు.
లబ్ధిదారులైన కున్నమల్ల తిరుపతమ్మ, కందుకూరి లావణ్య దంపతులను కార్పొరేటర్ జయలక్ష్మి బట్టలు పెట్టి, శాలువా కప్పి సన్మానించారు. ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి, టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు చొప్పున నియోజకవర్గానికి 3500 ఇండ్ల నిర్మాణం చేయిస్తున్న బృహత్తర కార్యక్రమమని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో 36, 46 డివిజన్ల కార్పొరేటర్లు పైడిపల్లి జయలక్ష్మి, కొత్వాల విమలాదేవి, హౌసింగ్ ఏ.ఈ సంతోష్, 36వ వార్డు ఆఫీసర్ సందీప్, కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్, నూకల రంగారావు, కొండం వెంకన్నగౌడ్, చింతా నాగరాజు, గుర్రం వెంకటరత్నం, పట్టా వీరకుమార్, నరిగె సుజాత, పాకాలపాటి రోశయ్య చౌదరి, ఎస్.కె.బాషా, ఎస్.కె.మదార్, అమీరుద్దీన్, రజినీకాంత్, చంద్ర వీరయ్య, బండి రఘు, కాపా శ్రీను, కట్టా పుష్ప, షేక్ షఫీ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.




