Palwancha: పాల్వంచ క్రీడాకారిణి సుతీర్థకు తైక్వాండోలో స్వర్ణ పతకం

Palwancha: పాల్వంచకు చెందిన సుతీర్థ యాదవ్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపిక. అభినందించిన తల్లిదండ్రులు, కోచ్.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 31 Oct 2026 4:28 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచ క్రీడాకారిణి సుతీర్థకు తైక్వాండోలో స్వర్ణ పతకం

పాల్వంచ: KTPS C కాలనీకి చెందిన యామర్తి సుతీర్థ యాదవ్ తైక్వాండోలో సత్తా చాటింది. హైదరాబాద్ ఉప్పల్ లో అక్టోబర్ 29 నుంచి 31 వరకు జరిగిన 70వ SGFI రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో అండర్-19 బాలికల Above-68 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.

ఈ విజయంతో ఆమె జార్ఖండ్ లో జరగనున్న 70వ జాతీయ పాఠశాల క్రీడలకు ఎంపికైంది. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న సుతీర్థ ఇప్పటికే మూడు జాతీయ పోటీల్లో పాల్గొంది. ఇది నాలుగోసారి జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.

SMA Taekwondo Academy ప్రధాన కోచ్ గణేష్ యాదవ్ శిక్షణలో సుతీర్థ ఈ ఘనత సాధించింది. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోచ్ గణేష్ యాదవ్ సూచించారు. KTPS-VII లో ADE గా పనిచేస్తున్న తండ్రి యామర్తి రవికుమార్, తల్లి కల్పన తమ కుమార్తె విజయంపై హర్షం వ్యక్తం చేశారు. సుతీర్థ విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN