Mulakalapalli: కమలాపురం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన పాల్వంచ సీఐ సతీష్!

Mulakalapalli: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను పాల్వంచ సీఐ సతీష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి భద్రతను పరిశీలించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 18 Nov 2026 5:41 PM IST
Mulakalapalli
X

Mulakalapalli: కమలాపురం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన పాల్వంచ సీఐ సతీష్!

ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురంలోని ఆశ్రమ పాఠశాలను పాల్వంచ సీఐ సతీష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణతో పాటు విద్యార్థులు నివసించే హాస్టల్‌ను పరిశీలించారు. విద్యార్థుల సంరక్షణ, భద్రత కోసం పాఠశాల యాజమాన్యం చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా హాస్టల్‌లో భద్రతా ఏర్పాట్లు, విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, పాఠశాల పరిసరాల పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, హాస్టల్ భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని పాఠశాల యాజమాన్యం, సిబ్బందికి సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చి రాములు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN