Palwancha: పాల్వంచ ఐడీఓసీ ఎదుట అంగన్వాడీల భారీ ధర్నా!
Palwancha: పాల్వంచ ఐడీఓసీ ఎదుట అంగన్వాడీల డిమాండ్లపై ఏఐటీయూసీ ధర్నా. హాజరై మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నేత షాబీర్ పాషా.
Palwancha: పాల్వంచ ఐడీఓసీ ఎదుట అంగన్వాడీల భారీ ధర్నా!
Palwancha: అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా హాజరై అంగన్వాడీ సిబ్బందికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సిబ్బంది హక్కుల పరిరక్షణకు సీపీఐ, ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది ధర్నాలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జమలయ్య, కార్యదర్శి నరాటి ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శులు వెలుపుల మల్లికార్జున, అన్నారపు వెంకటేష్, స్వరూప్‌తో పాటు ప్రజానాట్యమండలి కళాకారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.




