Palwancha: ఘనంగా ముగిసిన శ్యామల గోపాలన్ జాతీయ టెన్నిస్ టోర్నమెంట్

Palwancha: పాల్వంచలో ముగిసిన AISTA 2026 జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 22 Sept 2026 8:12 PM IST
Palwancha
X

Palwancha: ఘనంగా ముగిసిన శ్యామల గోపాలన్ జాతీయ టెన్నిస్ టోర్నమెంట్

పాల్వంచ: పాల్వంచ–కొత్తగూడెం జంట నగరాల వేదికగా ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన శ్యామల గోపాలన్ AISTA 2026 జాతీయ స్థాయి సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు 35+, 45+, 55+, 65+, 70+, 75+ వయో విభాగాల్లో హోరాహోరీగా పోటీ పడ్డారు. ఆతిథ్య జట్టు నుంచి అన్నం, భాస్కర్, కె. సతీష్, చ. కృష్ణారావులు వివిధ విభాగాల్లో విజేతలు, రన్నర్లుగా నిలిచి సత్తా చాటారు.

ముగింపు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై వివిధ విభాగాల్లో విజేతలు, రన్నర్లకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిని, టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

విజేతలు: 75+ డబుల్స్‌లో ASN రాజు–వై. భాస్కర్‌రావు; 70+ సింగిల్స్‌లో ధనుంజయ, డబుల్స్‌లో కే. విజయకృష్ణకుమార్–టి.వి. నాయుడు; 65+ సింగిల్స్‌లో వి. శ్రీనివాస్‌రెడ్డి, డబుల్స్‌లో ఆనంద స్వరూప్–టి. శ్రీనివాస్; 55+ సింగిల్స్‌లో కేవీఎన్ మూర్తి, డబుల్స్‌లో కేవీఎన్ మూర్తి–అన్నం; 45+ సింగిల్స్‌లో జి. రమేష్, డబుల్స్‌లో శివరామ్ రాజు–ఎంవీఎల్‌ఎన్ రాజు; 35+ సింగిల్స్‌లో మేశ్వరరావు, డబుల్స్‌లో కె. సతీష్–చ. కృష్ణారావు విజేతలుగా నిలిచారు.

రన్నర్లు: 75+ డబుల్స్‌లో వై.వి. రామకృష్ణ–రాజారతన్; 70+ సింగిల్స్‌లో రాధాకృష్ణమూర్తి, డబుల్స్‌లో డి.ఎస్. రావు–పార్థసారథి; 65+ సింగిల్స్‌లో ఎస్.ఎస్. రాథ్, డబుల్స్‌లో వి. శ్రీనివాస్‌రెడ్డి–బి. జోజి రెడ్డి; 55+ సింగిల్స్‌లో ప్రభజన్ రెడ్డి, డబుల్స్‌లో జి. విజయకుమార్–ఆర్.ఎస్. రాథోడ్; 45+ సింగిల్స్‌లో ఎంవీఎల్‌ఎన్ రాజు, డబుల్స్‌లో భాస్కర్–గంజి వెంకటేశ్వర్లు; 35+ సింగిల్స్‌లో మూర్తి కృష్ణప్ప, డబుల్స్‌లో మేశ్వరరావు–కురిమిన రవి నిలిచారు.

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కమిషనర్ కె. సుజాత, డీవైఅండ్‌ఎస్‌ఓ పరంధామరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, నాగ సీతారాములు, AISTA చీఫ్ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను BKDT అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, కార్యదర్శి జకరయ్య, ఉపాధ్యక్షుడు వై.వి.లు ఆధ్వర్యంలోని BKDT బృందం, NSR బృందం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించింది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN